నేడు గవర్నర్ వద్దకు బీఆర్ఎస్ నేతలు

తెలంగాణ గవర్నర్ ను బీఆర్ఎస్ నేతలు కలవనున్నారు.;

Update: 2024-07-20 04:01 GMT
governor, meet, brs leaders, telangana
  • whatsapp icon

తెలంగాణ గవర్నర్ ను బీఆర్ఎస్ నేతలు కలవనున్నారు. రాజ్‌భవన్ లో ఆయనను కలసి రాష్ట్రంలో జరుగుుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. వినతి పత్రం ఇవ్వనున్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా తమ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్యేలను బెదిరించి తమ పార్టీలో చేర్చుకుంటుందని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలు...
ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు. వీరికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించిన ఫొటోలు, వీడియోలను గవర్నర్ కు సమర్పించనున్నారు. అనంతరం పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను బీఆర్ఎస్ నేతలు కోరనున్నారు.


Tags:    

Similar News