Revanth Reddy : హైడ్రా మీద మరోసారి రేవంత్ సంచలన కామెంట్స్
హైడ్రా పై మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ నది ప్రక్షాళనపై కూడా ఆయన సంచలన కామెంట్స్ చేశారు
హైడ్రా పై మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ నది ప్రక్షాళనపై కూడా ఆయన సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోపలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాలను చేశారు. హైటెక్ సిటీకి నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్ధన్ రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని అభివృద్ధి చేశామని తెలిపారు. ఏడు వేల కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్ నగరంలో అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పి. జనార్థన్ ెడ్డి పోరాటంతోనే హైదరాబాద్ నగరానికి కృష్ణా జలాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు.
ఆక్రమణదారుల గుండెల్లో...
ఇబ్రహీంపట్నం దగ్గర అంతర్జాతీయ మార్కెట్ ను ఏర్పాటు చేయబోతుున్నట్లు ప్రకటించారు. శిల్పారామం కూడా కాంగ్రెస్ హయాంలో నిర్మించిందేనని తెలిపారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చి దిద్దుకుంటున్నామని తెలిపారు. బెంగళూరు, చెన్నై, కోల్ కత్తా వంటి నగరాల్లో కాలుష్యం పులుముకుందని, మరో పదేళ్లు హైదరాబాద్ లో ఏ పనిచేయకుంటే అదే స్థితికి వస్తామని చెప్పారు. అంతర్జాతీయ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపాలన్నారు. హైడ్రా ఆక్రమణ దారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందన్నారు. చెరువులు, నాలాను ఆక్రమించుకున్న వారిపైనే హైడ్రా కొరడా ఝుళిపిస్తుందన్నారు. హైదరాబాద్ నగరం పది కాలాల పాటు సురక్షితంగా ఉండాలంటే మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన అవసరమని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గత పదేళ్లలో ప్రభుత్వం హైదరాబాద్ నగరం అభివృద్ధిని విస్మరించిందని చెప్పారు. ట్రాఫిక్, కాలుష్యం సమస్య లేని నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.