KTR : తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఏమన్నారంటే?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు;

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని తెలిపారు. గురుకుల విద్యాసంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారన్న కేటీఆర్ పాఠశాల వ్యవస్థను నీరుగార్చారని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో భావితరాలకు శాపంగా మారిందని కేటీఆర్ అన్నారు.
గత పదేళ్లలో...
గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో గురుకులాల్లో చదువుకున్న వారంతా ఉన్నతవిద్యను అభ్యసించారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ నేడు పూర్తిగా అధ్వాన్న స్థితికి చేరుకున్నాయని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో గురుకులాలు ఎంతో అభివృద్ధి చెందాయన్న కేటీఆర్, నాడు ఎందరో వైద్యం, ఇంజినీరింగ్ చదువుకు ఎంపికై తమ జీవితాలను మెరుగుపర్చుకున్నారని తెలిపారు.