Telangana : నేడు హైదరాబాద్ లో బీసీ రణభేరి
స్థానికసంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్ లో నేడు బీసీల సదస్సు జరగనుంది;
హైదరాబాద్ లో నేడు బీసీల సదస్సు జరగనుంది. స్థానికసంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఈ సభను నిర్వహిస్తున్నారు. సావిత్రిబాయి పూలే సందర్భంగా బీసీలను సంఘటితం చేసేందుకు, తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు కవిత ఒక వేదికను ఏర్పాటు చేశారు. ఇందిరాపార్కు వద్ద బీసీమహాసభను నేడు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రం నలుమూలల నుంచి...
రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దయెత్తున బీసీలు ఈసభకు తరలివస్తున్నారు. ఇప్పటికే బీసీ మహాసభకు దాదాపు చాలా సంఘాలు మద్దతు తెలిపాయి. విద్యార్థి జేఏసీ కూడా ఈ సదస్సుకు మద్దతు ప్రకటించింది. అయితే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలని కోరుతూ నేడు సభను కవిత నిర్వహిస్తున్నారు. బీసీలకు ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ ప్రధాన లక్ష్యంతో సదస్సు జరగనుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now