నాడు ఏం చేశారు..? బీఆర్ఎస్ నేతలకు అద్దంకి సూటి ప్రశ్న
బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ విమర్శలు చేశారు;

బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ విమర్శలు చేశారు. జల వివాదం సృష్టించాలని బీఆర్‌ఎస్ నేతల యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టాలని కుట్రచేస్తున్నారని అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు జలాలు, నదులపై చర్చలు జరుగుతూనే ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ నేతలు హరీష్‌రావు, కేటీఆర్‌కు అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు.
గతంలో రాయలసీమ ప్రాజెక్టులకు...
గత ప్రభుత్వ హయాంలో పోతిరెడ్డిపాడుతో పాటు రాయలసీమ ప్రాజెక్టులు చేపడితే సైలెంట్‌గా ఎందుకు ఉన్నారంటూ అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. నాడు రాయలసీమ ప్రాజెక్టులను అప్పటి ప్రభుత్వం చేపట్టినా మౌనంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మాత్రం అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ నేతలు అసత్యాలు మానుకోవాలని హితవు పలికారు.