Earth Quake : తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు
తెలంగాణలో మరోసారి భూప్రకంపనలు కనిపించాయి. మహబూబ్ నగర్ లో భూమి కంపించినట్లు తెలిసింది
తెలంగాణలో మరోసారి భూప్రకంపనలు కనిపించాయి. మహబూబ్ నగర్ లో భూమి కంపించినట్లు తెలిసింది. రిక్టర్ స్కేల్ పై 3 తీవ్రతాగా నమోదయింది. కౌకుంట్ల మండలం దాసరిపల్లిలో భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. భూకంంప కేంద్రం దాసరిపల్లిలో ఉందని అధికారులు వెల్లడించారు.
రిక్టర్ స్కేల్ పై తీవ్రతగా...
ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో భూకంపం సంభవించడంతో ప్రజలు ఆందోళన చెందారు. నాడు తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే నేడు రిక్టర్ స్కేల్ పై తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ మరోసారి మహబూబ్ నగర్ జిల్లాలో భూప్రకంపనలు సంభవించడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.