Flood Alert: డేంజర్ మార్క్ దాటింది.. వరద హెచ్చరికలు జారీ

మరో ముప్పు పొంచి ఉంది

Update: 2024-09-08 05:12 GMT

వారం రోజుల క్రితం మున్నేరు నది సృష్టించిన విధ్వంసాన్ని మరవక ముందే మరో ముప్పు పొంచి ఉంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి భారీ ఇన్‌ఫ్లో వస్తోంది. మున్నేరు వరద ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 24 అడుగులు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. వరద పెరుగుతుండటంతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రికి వరద పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో రహదారులను మూసివేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శనివారం రాత్రి ఖమ్మం చేరుకున్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సహాయక శిబిరాలను సందర్శించారు. జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. ఖమ్మం కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ కూడా బాధిత కాలనీలను సందర్శించి ప్రజలను అప్రమత్తం చేశారు.


Tags:    

Similar News