KCR : వరంగల్ జిల్లా నేతలతో సమావేశమైన కేసీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు సమావేశమయ్యారు.;

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు సమావేశమయ్యారు. ఎర్రవెల్లి ఫాం హౌస్ కు వెళ్లిన నేతలకు కేసీఆర్ ఈ నెల 27వ తేదీన జరిగే ఆవిర్భావ సభపై దిశానిర్దేశం చేశారు. సభా వేదిక నుంచి జన సమీకరణ, కార్యకర్తలకు ఈ ఎండల తీవ్రతకు అవసరమైన ఏర్పాట్లను చూడాలని కేసీఆర్ వరంగల్ జిల్లా నేతలను ఆదేశించారు.
రజతోత్సవ మహాసభలను...
రజతోత్సవ మహాసభలను విజయవంతం చేయడంపై కేసీఆర్ మార్గదర్శనం చేశారు. కార్యకర్తలు తిరిగి ఇంటికి క్షేమంగా చేరేవరకూ నేతలే దగ్గరుండి బాధ్యతలను చూసుకోవాలని కోరారు. బహిరంగ సభ వీలయినంత త్వరగా పూర్తి చేస్తామని, వారికి అవసరమైన ఆహారం, మంచినీరు, మజ్జిగ వంటి వాటిని సిద్ధం చేాలని సూచించారు.