ఫార్ములా ఈ కారు రేసు కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించిన వివరాలను బయటపెట్టింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ, ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఆయన ఈరోజు ఏసీబీ విచారణకు హాజరు కావాల్సిఉన్నా తన న్యాయవాదితో అనుమతించకపోవడంతో హాజరు కాలేదు. అయితే మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు ఈ ప్రయత్నంలో ఉండగానే కాంగ్రెస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి, ఫార్ములా ఈ రేసు లో ఒప్పందం కుదుర్చుకన్న భాగస్వామి కంపెనీకి సంబంధించిన లావాదేవీలను బయటపెట్టింది.
గ్రీన్ కో దాని అనుబంధ సంస్థల నుంచి..
ఫార్ములా ఈ కారు రేసు లో భాగస్వామిగా ఉన్న గ్రీన్ కో సంస్థ బీఆర్ఎస్ నుంచి ఎన్నికల సమయంలో బాండ్లను కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. గ్రీన్ కో దాని అనుబంధ సంస్థల నుంచి 41 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో బీఆర్ఆర్ కు అందాయని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. మొత్తం నలభై ఒక్కసార్లు ఈ లావాదేవీలు జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఫార్ములా ఈ రేసు భాగస్వామి కంపెనీకి, బీఆర్ఎస్ కు మధ్య ఉన్న అనుబంధాన్ని కాంగ్రెస్ పార్టీ బయటపెట్టడంతో ఇది నేడు ఈ కేసులో కీలకంగా మారనుంది. 41 సార్లు నలభై కోట్ల రూపాయల బాండ్లను బీఆర్ఎస్ నుంచి కొనుగోలు చేసినట్లు ఆధారాలున్నాయని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది.
బాండ్ల కొనుగోలు కేసులో...
ఇది నిజంగా ఫార్ములా ఈ రేసు కేసులో కొత్త కోణంగానే చూడాలి. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పెద్దయెత్తున బాండ్ల రూపంలో విక్రయించి పార్టీ నిధులను రాట్టుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అందులో గ్రీన్ కో సంస్థ నలభై ఒక్క కోట్ల మేర బాండ్లను కొనుగోలు చేసినట్లు చెబుతోంది. ప్రతి సారి కోటి రూపాయల మేరరకు బాండ్లను కొనుగోలు చేసినట్లు కంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. బీఆర్ఎస్ నుంచి గ్రీన్ కో దాని అనుబంధ సంస్థలు 2022 ఏప్రిల్ 20 నుంచి అక్టోబరు వరకూ బాండ్ల కొనుగోలు చేసినట్లు తెలిపింది. దీంతో ఈ దిశగా కూడా ఏసీబీ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించే అవకాశముందని తెలిసింది. మొత్తం మీద విచారణ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ కీలక అంశాలను బయటపెట్టడంతో ఈ ఫార్ములా కారు రేసింగ్ కేసులో అవినీతి జరిగిందన్న తమ ఆరోపణలు నిజమయ్యే అవకాశముందని హస్తం పార్టీ భావిస్తుంది. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ