Telangana : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకు పదిహేను వందలిచ్చి.. ఉచిత కోచింగ్
తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బీసీ విద్యార్ధులకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిర్ దరఖాస్తులను ఆహ్వానించింది.;

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బీసీ విద్యార్ధులకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిర్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆర్.ఆర్.బి, ఎస్.ఎస్.సి. బ్యాంకింగ్ పరీక్షల కోసం ఉచిత కోచింగ్ నిర్వహిస్తుంది. బీసీ స్టడీ సర్కిల్ లో ఈ ఉచిత శిక్షణను అందచేస్తారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
అర్హతలివీ...
అయితే గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షల, పట్టణాల్లో రెండు లక్షల ఆదాయం లోపు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వారే ఈ ఉచిత కోచింగ్ అర్హులని బీసీ స్టడీ సర్కిల్ ప్రకటించింది. డిగ్రీ, ఇంటర్ మార్కుల ఆధారంగా అర్హులైన వారిని కోచింగ్ కు ఎంపిక చేస్తారు. వంద రోజుల కోచింగ్ కు నెలకు పదిహేను వందల రూపాయల స్టయిఫండ్ కూడా ఇవ్వనున్నారు. దరఖాస్తు చేయడానికి వచ్చే నెల 9వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. అర్హులైన వారు studycircle.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.