Telangana : తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీలు
తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ ల బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది;

తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ ల బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఎనిమిది మంది ఐఏఎస్ బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రవాణాశాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ సహకార శాఖ కమిషనర్ గా, మార్కెంటింగ్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వివిధ శాఖలకు...
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ కర్ణన్ ను ఆరోగ్య శ్రీ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించార. ఆ పోస్టులో ఉన్న శివశంకర్ ను జీఏడీలో రిపోర్టు చేయాలని కోరారు. ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి హరితను వాణిజ్యపన్నుల శాఖ డైరెక్టర్ గా నియమించారరు. ఉద్యానవన శఆఖ డైరెక్టర్ యాస్మిన్ భాషాను సీడ్స్ డెవలెప్ కార్పొరేషన్ గా నియమించారు. తెలంగాణ ఫుడ్స్ ఎండీగా ఉన్న శ్రీనివాసరెడ్డిని జైళిశాఖకు పంపారు. వనపర్తి అదనపు కలెక్టర్ సంచిత్ గాంగ్వార్ ను నారాయణపేట్ అదనపు కలెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.