హైదరాబాద్‌లో కుండపోత వర్షం

హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల రహదారులపై వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు

Update: 2023-09-05 08:52 GMT

హైదరాబాద్‌లో కుండపోత వర్షం

హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల రహదారులపై వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచీ కురుస్తున్న కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

కొన్ని చోట్ల రహదారులపై వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచీ కురుస్తున్న కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలో ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కృష్ణానగర్, ఫిలింగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎస్‌ఆర్ నగర్‌, షేక్‌పేట్, మణికొండ, రాయదుర్గం, మెహదీపట్నం, టోలిచౌకి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌తోపాటు చాలా ప్రాంతాల్లో జోరుగా వర్షం పడింది. చింతల్, సుచిత్రా, జీడిమెట్ల, బాలానగర్, కూకట్‌పల్లి సహా పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. హైదరాబాద్ నగరమే కాకుండా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జోరు వాన కురుస్తోంది. వర్షం ప్రభావంతో నగరంలోని పలుప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Tags:    

Similar News