Telangana : సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం సచివాలయంలో జరిగింది

Update: 2024-12-09 12:48 GMT

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం సచివాలయంలో జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పీఠంలో నీలం రంగు, గోదావరి, కృష్ణమ్మ గుర్తులతో మెడకు కంటె, గుండుపూసులు, హారంతో విగ్రహాన్ని రూపొందించారు, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ తల్లిని రూపొందించనట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

సంస్కృతి సంప్రదాయాలకు...
సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనమని తెలిపారు. తెలంగాణ తల్లి భావన కాదని నాలుగు కోట్ల మంది ప్రజల భావోద్వేగం అని తెలిపారు. ఈ సందర్భంగా గీత రచయిత అందెశ్రీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదరంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వేలాది మంది సమక్షంలో తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అట్టహాసంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.


Tags:    

Similar News