Rain Alert: తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో నేడు పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి

Update: 2024-07-08 09:52 GMT

తెలంగాణ రాష్ట్రంలో నేడు పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. అలాగే బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది. రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్‌ అంచనా వేసింది. జూలై 12 వరకు బలమైన గాలులు వీచే అవకాశం ఉండడంతో.. వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. IMD హైదరాబాద్ హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

నేడు హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, మల్కాజిగిరి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కుమురం భీమ్, నిర్మల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.


Tags:    

Similar News