Ponnam Prabhakar : నేడు మూడు జిల్లాలకు పొన్నం ప్రభాకర్
నేడు సిద్దిపేట, కరీంనగర్ , హనుమకొండ జిల్లాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు;

నేడు సిద్దిపేట, కరీంనగర్ , హనుమకొండ జిల్లాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు సిద్దిపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో కంది కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ , చిగురు మామిడి, సైదాపూర్ , ఎల్కతుర్తి , భీమదేవరపల్లి , హుస్నాబాద్ టౌన్ ,హుస్నాబాద్ మండలాల్లో ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలని పరామర్శించనున్నారు.
అభివృద్ధి కార్యక్రమాలతో పాటు...
ఒకే రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ మూడు జిల్లాల్లో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వ్యవసాయ కేంద్రంలో రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. పొన్నం ప్రభాకర్ పర్యటనకు వస్తుండటంతో పార్టీ శ్రేణులు పెద్ద యెత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.