బంగారం ధర తగ్గింది.. పది గ్రాములు ఎంతంటే?

దేశంలో బంగారం ధర ఈరోజు కొంత తగ్గింది. ఇది వినియోగదారులకు కొంత ఊరట కల్గించే అంశమే.;

Update: 2021-12-04 01:50 GMT
gold, silver, hyderabad, bullion market, prices
  • whatsapp icon

దేశంలో బంగారం ధర ఈరోజు కొంత తగ్గింది. ఇది వినియోగదారులకు కొంత ఊరట కల్గించే అంశమే. నిత్యం పెరుగుతూ వస్తున్న బంగారం ధర కొంత తగ్గినా అది మార్కెట్ కు సానుకూలమేనంటున్నారు నిపుణులు. దీనివల్ల బంగారం కొనుగోళ్లు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. పెట్టుబడిగా భావించి కొనుగోలు చేసే వారు ధరలు తగ్గినప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తారన్న అభిప్రాయం మార్కెట్ నిపుణుల్లో వ్యక్తమవుతుంది.

ఈరోజు ధరలు ఇలా...
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం గ్రాముకు 13 రూపాయలు తగ్గింది. దీంతో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,580 రూపాయలుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,580 రూపాయలకు చేరుకుంది. పది గ్రాములకు 130 రూపాయలు తగ్గింది.


Tags:    

Similar News