అది చిన్న సమస్య.. దాని ఊసే సమావేశంలో లేదు : దిల్ రాజు
హైదరాబాద్ ను ఒక సినీ పరిశ్రమకు ఇంటర్నేషనల్ హబ్ గా మార్చాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు
హైదరాబాద్ ను ఒక సినీ పరిశ్రమకు ఇంటర్నేషనల్ హబ్ గా మార్చాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు. సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో ఎఫ్ డిసీ ఛైర్మన్ దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లాలని సీఎం సూచించారన్నారు. తెలుగు సినిమా ఇండ్రస్ట్రీపై తన విజన్ ను సీఎం స్పష్టంగా చెప్పారన్నారు. ఈ సమావేశాన్ని ఎఫ్డీసీ ఛైర్మన్ గా చొరవ తీసుకున్నానని తెలిపారు. టాలీవుడ్ ఇండ్రస్ట్రీకి తన సహకారం ఉంటుందని తెలిపారు.
కమిటీని ఏర్పాటు చేసి...
సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారన్నారు. తాము సమావేశమై ముఖ్యమంత్రికి తర్వాత జరిగే సమయం నాటికి నివేదిక ఇస్తామని తెలిపారు. బెనిఫిట్ షోలు, టిక్కెట్ల ధరల పెంపుదలపై ఎటువంటి చర్చ జరగలేదని దిల్ రాజు తెలిపారు. సినిమా ఇండ్రస్ట్రీ నుంచి, మంత్రుల నుంచి కొందరిని కమిటీగా తీసుకుని సినీ పరిశ్రమ అభివృద్ధికి ఏం చేయాలో డిసైడ్ చేస్తామని తెలిపారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ