ఈ ప్రాంతాల్లో వర్షాలే..!

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని

Update: 2023-08-28 03:08 GMT

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షాలు పడతాయని చెప్పింది. నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, మెదక్‌, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. కరీంనగర్‌, ములుగు, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లా, నిర్మల్‌, మంచిర్యాల, నల్గొండ, మహబూబాబాద్‌, జగిత్యాల, వికారాబాద్‌ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో 120.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఆసిఫాబాద్ జిల్లాలో 115 మిల్లీ మీటర్లు , కామారెడ్డి జిల్లాలో 64.5 మిల్లీమీటర్లు, రంగారెడ్డి జిల్లా పెద్దషాపూర్‌లో 42 మి.మీ, నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లిలో 37.3 మి.మీ, భూపాలపల్లి జిల్లా పెద్దంపేటలో 32.5 మి.మీ వర్షపాతం నమోదైంది.

ఏపీలో చాలా రోజుల తర్వాత నైరుతి రుతుపవనాల్లో కదలిక వచ్చింది. రాష్ట్రంపై నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావం రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.


Similar News