Telangana : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. వెంటనే వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభయ్యాయి. వెంటనే వాయిదా పడ్డాయి;

Assembly Meetings Speaker Election
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభయ్యాయి. కులగణనపై నేడు సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ఇంకా కొనసాగుతున్నందున సభను స్పీకర్ గడ్డం ప్రసాదరావు వాయిదా వేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయిన వెంటనే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సభను వాయిదా వేయాలని కోరారు.
మంత్రివర్గ సమావేశం జరుగుతున్నందు...
తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగుతున్నందున, ఇంకా చర్చలు జరుగుతున్నందున వాయిదా వేయాలని కోరారు. దీంతో సభ ప్రారంభమయిన కొద్ది నిమిషాలకే సభను స్పీకర్ గడ్డం ప్రసాదరావు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. దీంతో కులగణనపై సర్వే నివేదికను సభలో మధ్యాహ్నం ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.అసెంబ్లీ సంప్రదాయాలను ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు