Revanth Reddy : భూభారతిపై ముఖ్యమంత్రి నిర్ణయమిదే
భూభారతిపై అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు;

భూభారతిపై అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులకు భూ భారతి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 14న భూభారతి పోర్టల్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
అవగాహన కల్పించాలని...
ప్రజల సూచనలతో పోర్టల్‌ను మరింత బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అవగాహన సదస్సుల బాధ్యత కలెక్టర్లకు అప్పగించిన ముఖ్యమంత్రి ఎలాంటి అనుమానాలు వచ్చినా నివృత్తి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.