Revanth Reddy : 750 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుపాయల వనదుర్గ భవానీ దేవాలయాన్ని సందర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుపాయల వనదుర్గ దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు రేవంత్ రెడ్డికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసులురెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. పెద్దయెత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.
అక్కడి నుంచి మెదక్ చర్చిలో...
ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం 750 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మెదక్ కు వెళతారు. మెదక్ చర్చి శతజయంతి ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. క్రిస్మస్ సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొంటారు.