Revanth Reddy : నేడు హైదరాబాద్ కు రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్ రానున్నారు. ఆ;

Update: 2024-08-14 02:26 GMT
revanth reddy,  chief minister, abroad tours, hyderabad
  • whatsapp icon

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్ రానున్నారు. ఆయన దాదాపు పది రోజులకు పైగానే విదేశాల్లో పర్యటించి తెలంగాణకు రానున్నారు. అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించిన రేవంత్ రెడ్డి బృందం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పలువురు పారిశ్రామికవేత్తలను, వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలను నిర్వహించింది. వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.

ఒప్పందాలు కుదుర్చుకుని...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో 31,532 కోట్ల రూపాయల ఒప్పందాలను కుదుర్చుకున్నారని అధికారిక వర్గాలు చెప్పాయి. హైదరాబాద్ లో ఈ కంపెనీలు ఏర్పాటయింది. దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా రాష్ట్ర ఆదాయం కూడా పెరిగే అవకాశముంది.


Tags:    

Similar News