Telangana : నేడు రేవంత్ రెడ్డి సమీక్షలు ఇవే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పలు శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు.;

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పలు శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం సచివాలయానికి వెళ్లనున్న రేవంత్ రెడ్డి పలు శాఖలకు చెందిన అధికారులతో సమావేశం కానున్నారు. తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విద్యా కమిషన్ తో రేవంత్ రెడ్డి చర్చిస్తారు.
విద్యావిధానంలో...
ఈ సమావేశంలో ప్రస్తుత విద్యావిధానం, తీసుకు రావాల్సిన మార్పులపై చర్చించనున్నారు. పరీక్షలతో పాటు సిలబస్ వంటి వాటిపై కూడా విద్యా కమిషన్ తో చర్చించనున్నారని తెలిసింది. విద్యారంగంలో మార్పులు తీసుకు రావాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి విద్యా కమిషన్ తో చర్చలు జరిపి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.