Revanth Reddy : నేడు రేవంత్ కీలక భేటీ.. తేదీలు ఫిక్స్ అవుతాయా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు.;

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయం పదకొండు గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆయన సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా పాల్గొంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై...
వీరితో పాటు బీసీ డెడికేషన్ కమిషన్ ఛైర్మన్ కూడా పాల్గొంటారు. ఇప్పటికే పంచాయతీలు, మున్సిపాలిటీలు, కొన్ని కార్పొరేషన్లలో పదవీ కాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్ పాలన ప్రారంభమయింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపుదలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ఈ సమావేశంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.