Revanth Reddy : నేడు సీఎం పాలమూరు పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు;

Revanth Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. మధ్యాహ్నం 12 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా చింతకుంట మండలం అమ్మాపురం చేరుకుంటారు. అక్కడి కురుమూర్తి స్వామి దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
కురుమూర్తి స్వామి దేవాలయంలో...
అంతకు ముందు కురుమూర్తి స్వామి దేవాలయానికి సమీపంలో ఘాట్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం కురుమూర్తి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా పర్యటనకు వస్తుండటంతో నేతలు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.