Revanth Reddy : రేవంత్ ప్రచార సభలు నేడు ఇలా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.;

Update: 2024-05-03 02:29 GMT
revanth reddy, delhi, campaign, telangana, elctions campaign
  • whatsapp icon

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో వరస సభలతో ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో ఆయన ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ ముందుకు వెళుతున్నారు.

నేడు మూడు నియోజకవర్గాల్లో...
ఈరోజు రేవంత్ రెడ్డి ధర్మపురి, సిరిసిల్ల, ఉప్పల్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ధర్మపురి జనజాతర సభకు రేవంత్ హాజరవుదారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు సిరిసిల్లలో జరిగే సభలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం ఉప్పల్ లో జరిగే రోడ్ షోలో రేవంత్ పాల్గొని పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News