Revanth Reddy : నేడు మూడు జిల్లాలకు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు;

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ మొహరించింది. ఎలాగైనా మూడు సీట్లను గెలిచి శాసనమండలిలో తమ పట్టును మరింత నిలుపుకోవాలని ప్రయత్నిస్తుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో...
ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండటం, రేపటితో ప్రచారానికి గడువు ముగియనుండటంతో నేటి నుంచి ప్రచారంలో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మంచిర్యాల, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు.