Revanth Reddy : మరికాసేపట్లో హైదరాబాద్ కు రేవంత్ బృందం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసింది.;

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసింది. ఉదయం పది గంటలకు రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ చేరుకోనుంది. దావోస్ పర్యటనలో 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిన రేవంత్ రెడ్డి బృందానికి శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు యాభై వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
పది రోజుల నుంచి...
దావోస్ పర్యటనకు ముందే ఢిల్లీ బయలుదేరిన రేవంత్ రెడ్డి పది రోజుల నుంచి రాష్ట్రంలో అందుబాటులో లేరు. ఆయన ఈరోజు రావడంతో అధికారులతో పాటు నేతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయనకు నేరుగా స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రేవంత్ రెడ్డి విమానాశ్రయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లి అక్కడి నుంచి సచివాలయానికి చేరుకునే అవకాశముంది.