Telangana : నేడు హైదరాబాద్ కు మీనాక్షి నటరాజన్
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు.;

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఎన్.ఎస్.యూ.ఐ నేతలతో సమావేశమవుతారు. కంచె గచ్చిబౌలి లోని నాలుగు వందల ఎకరాల భూమి వివాదంగా మారడంతో దీనిపై చర్చించనున్నారు. అనంతరం ఈ భూముల వివాదంపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీతో కూడా సమావేశం కానున్నారు.
కంచె గచ్చిబౌలి భూముల విషయంలో...
అందరితో చర్చించిన అనంతరం కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వ నిర్ణయం, తర్వాత జరిగిన పరిణాలు, వాస్తవ పరిస్థితులను అధినాయకత్వానికి అందించనున్నారు. పార్టీ హైకమాండ్ ఆదేశాలతోనే ఆమె నేడు హైదరాబాద్ కు ప్రత్యేకంగా కంచె గచ్చి బౌలి భూముల విషయానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే వస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.