టీటీడీకి లేఖలు ఇచ్చేవారికి ప్రభుత్వం అలెర్ట్
తిరుమల తిరుపతి దేవస్థానంలో సిఫార్సు లేఖలకు తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించింది.;

తిరుమల తిరుపతి దేవస్థానంలో సిఫార్సు లేఖలకు తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించింది. ఇకపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే సిఫార్సు లేఖలను ఆన్ లైన్ లో పంపించాలని పేర్కొంది. ఇందుకోసం ప్రత్యేకంగా పోర్టల్ ను ప్రభుత్వం రూపొందించింది. ఈ పోర్టల్ ద్వారానే ప్రజాప్రతినిధులు ప్రజలకు ఇచ్చే సిఫార్సు లేఖలను టీటీడీకీ పంపాలని ముఖ్యమంత్రి కార్యాలయం కోరింది.
మెయిల్ ద్వారా...
లేఖలను http//cmottd. telangana.gov.in ద్వారా ఖచ్చితంగా పంపాలని సీఎంవో తెలిపింది. భక్తులకు అసలు లేఖను ఇస్తే రెండింటినీ సరి చూసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు వసతి, దర్శనం ఏర్పాట్లు చేస్తారని, ఎలాంటి మోసాలకు తావుండదని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఇకపై అందరూ ఆన్ లైన్ ఖచ్చితంగా టీటీడీకి పంపాలని కోరింది.