Telangana : హెచ్ఎంపీవీ వైరస్ తో అలెర్ట్ అయిన తెలంగాణ సర్కార్.. మార్గదర్శకాలివే
తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది;
తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయాలను తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్యం- కటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ బీ రవీందర్ నాయక్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క హెచ్ఎంపీవీ కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు. దీని బారిన పడకుండా ఉండటానికి పలు సూచనలు ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే హెచ్ఎంపీవీ వైరస్ సోకదని ఆయన తెలిపారు. అయితే ఎవరూ భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ