White Ration Cards : తెల్ల రేషన్ కార్డులు పొందాలంటే ఇవే అర్హతలట

తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేయడానికి సిద్ధమవుతుంది. అర్హతలను నిర్ణయించింది.

Update: 2024-08-10 12:52 GMT

తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేయడానికి సిద్ధమవుతుంది. తెలుపు రంగు రేషన్ కార్డులుంటే ప్రభుత్వ పథకాలు వారికి వర్తిస్తాయి. అందుకే తెలుపు రంగు రేషన్ కార్డుల కోసం అనేక మంది పోటీ పడుతుంటారు. అయితే వార్షికాదాయం ప్రకారం తెలంగాణలో తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అర్హులందరికీ తెలపురంగు రేషన్ కార్డులు అందించి, తద్వారా ఎన్నికలలో ఇచ్చిన గ్యారంటీలను వారికి మాత్రమే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది.

ఇవే నిబంధనలు...
తెల్ల రేషన్ కార్డులుండాలంటే వార్షికాదాయం ఇన్ని లక్షల రూపాయలకు మించి ఉండకూడదన్న నిబంధనను పాటిస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోనూ భూములు కలిగి ఉన్నవారికి తెలుపు రంగు రేషన్ కార్డులు మంజూరు చేయరు. గ్రామీణ ప్రాంతంలో లక్షనర, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు ఉన్నవారే తెలుపు రంగు రేషన్ కార్డులకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో మాగాణి 3.5 ఎకరాలు, మెట్ట 7.5 ఎకరాలు ఉన్న వారికి మాత్రమే రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.


Tags:    

Similar News