Telangana : మహిళలకు తీపికబురు... ఓకే సంతకంతో 14, 236 పోస్టుల భర్తీ
తెలంగాణ ప్రభుత్వం పెద్దయెత్తున పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమయింది;

తెలంగాణ ప్రభుత్వం పెద్దయెత్తున పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమయింది. అంగన్ వాడీ, హెల్పర్ల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి సీతక్క ఫైలు పై సంతకం చేసినట్లు తెలిసింది. మొత్తం 14,236 పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయిం తీసుకుంది. ఇప్పటి వరకూ ఇంత పెద్ద స్థాయిలో పోస్టులు భర్తీ చేయలేదని, ఇదే ప్రధమమని చెబుతున్నారు.
పోస్టులివీ...
ఇందులో అంగన్ వాడీ టీచర్ల పోస్టులు 6,339 ఉండగా, హెల్పర్ పోస్టులు 7,897 ఉన్నాయి. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రస్తుతం అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కోడ్ పూర్తి అయిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. దీంతో తెలంగాణ మహిళలకు తీపికబురు ప్రభుత్వం చెప్పినట్లయింది. తెలంగాణ మహిళ స్త్రీ శిశుసంక్షేమ శాఖలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.