గ్రూప్ వన్ పరీక్షలపై సర్కార్ కు ఊరట

గ్రూప్ వన్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. గ్రూప్ వన్ పరీక్షల ఫలితాలు వాయిదా వేయాలంటూ వేసిన పిటీషన్లను కొట్టివేసింది.

Update: 2024-12-26 08:45 GMT

గ్రూప్ వన్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. గ్రూప్ వన్ పరీక్షల ఫలితాలు వాయిదా వేయాలంటూ వేసిన పిటీషన్లను కొట్టివేసింది. రిజర్వేషన్లు ఖరారయ్యేంత వరకూ ఫలితాలు వెల్లడించకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలయిన పిటీషన్ లను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే గ్రూప్ వన్ పరీక్షలు ఫలితాలు పూర్తయ్యాయి.

పిటీషన్లను కొట్టివేస్తూ...
ఈ ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకూ గ్రూప్ వన్ పరీక్షలు జరిగాయి. అయితే తెలంగాణ హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు కూడా సూచించడంతో హైకోర్టును మరోసారి అభ్యర్థులు ఆశ్రయించారు. గ్రూప్ వన్ పరీక్షల ఫలితాలు వాయిదా వేయాలని కోరిన పిటీషన్లను కొట్టివేయడంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమమయింది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ 



 


Tags:    

Similar News