Big Breaking : తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. రేవంత్ సర్కార్ కు షాక్
తెలంగాణ హైకోర్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాకిచ్చింది. భూసేకరణ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది.;

తెలంగాణ హైకోర్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాకిచ్చింది. భూసేకరణ నోటిఫికేషన్ పై స్టే విధిస్తూ తీర్పు చెప్పింది. లగచర్ల, హకీంపేటలో భూసేకరణ విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ పై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రభుత్వానికి భూసేకరణ విషయంలో ఎదురుదెబ్బ తగిలినట్లే.
భూసేకరణ రద్దు...
లగిచర్ల, హకీంపేటలో భూసేకరణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. లగచర్లలో అక్కడ ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయడానికి భూసేకరణ సందర్భంగా కలెక్టర్ వెళ్లినప్పుడు అక్కడ ఘర్షణలు కూడా జరిగాయి. దీంతో రైతులు జైలుకు కూడా వెళ్లారు. అయితే ప్రస్తుతం ఆ నోటిఫికేషన్ పై స్టే ఇస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.