Telangana Inter Results 2024: సెకండ్ ఇయర్ లో ములుగు జిల్లా ఫస్ట్
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి.
Telangana Inter Results 2024:తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. సెకండ్ ఇయర్ లో 64 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం 60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్ ఫలితాల్లో ములుగు జిల్లా మొదటి స్ఠానంలో నిలిచింది.
సప్లిమెంటరీ పరీక్షలు...
రీకౌంటింగ్ రేపటి నుంచి ప్రారంభమై మే 2వ తేదీ వరకూ జరగుతాయిని అధికారులు తెలిపారు. ఇందుకోసం 600 రూపాయలు చెల్లించాలి. సప్లిమెంటరీ పరీక్షలు 24 మే నుంచి ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. తెలంగాణాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమై మార్చి 19 వతేదీ వరకూ జరిగాయి. ఇంటర్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in/ చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.
తెలంగాణల ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు కొరుకు ఇక్కడ క్లిక్ చేయండి