చంద్రబాబు ఫిట్ నెస్ పై శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు గ్లోబల్ కేపబులిటి ఉంది. చంద్రబాబు ది బ్రాడ్ మెంటాలిటీ ఉందని తెలిపారు. చంద్రబాబు తో తాను మాట్లాడానని, ఆయన చాలా బ్రాడ్ థింకింగ్ తో ఉన్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు అపార వనరులు ఉన్నాయి. కోస్టల్ ఏరియా ఉందన్న శ్రీధర్ బాబు ఆ ఏరియాలో మంచి పరిశ్రమలు వస్తాయని, ఇప్పటికే దావోస్ లో ఎంవోయూలు ఏపీ ప్రభుత్వం చేసుకుందన్నారు. అయితే ఎంవోయూలు దావోస్ లో ఎందుకు ప్రకటించలేదని తాను లోకేష్ ను అడిగానని, తాము ఆంధ్రప్రదేశ్ లోనే ప్రకటిస్తానని చెప్పారన్నారు. తనకు వారు పెట్టుబడుల వ్యవహారంలో వ్యూహంతో ఉన్నారు అని అర్థమైందన్నారు.
ఎక్కువ పెట్టుబడులు...
ఆంధ్రప్రదేశ్ కు ఉన్న అనుకూలతలు,పెట్టుబడులు పెట్టించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు..అల్టిమేట్ అని శ్రీధర్ బాబు ప్రశంసించారు. చంద్రబాబు ప్రయత్నాలు అన్ని సఫలం అయితే..రేపు మీ మీడియాలోనే మమ్మల్ని కంపేర్ చేసేటప్పుడు తక్కువ చేసి చూపించే అవకాశం ఉంటుందన్నారు. ఆయన హైదరాబాద్ ను డిస్టర్బ్ చేసే మూడ్ లో లేరని, ఆయన మాటలు చాలా పెద్దరికంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ కంపెనీలు ఏపికి రావాలని, ఇక్కడ డిస్టర్బ్ చేయాలనే ఆలోచన ఆయనకు అస్సలు లేదు...హైదరబాద్ ఇంకా అభివృద్ది కావాలి అని కోరుకుంటున్నారని తెలిపారు. దావోస్ లో మైనస్ 8 నుండి 11 వరకు టెంపరేచర్ ఉందని, తామంతా స్వెట్టర్స్ వేసుకున్నామని, ఆయన రెగ్యులర్ డ్రెస్ లో ఉన్నారని, చంద్రబాబు గారు చాలా ఫిట్ గా ఉన్నారని, ఆయన ఆ ఏజ్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారని శ్రీధర్ బాబు తెలిపారు.