Telangana : రాఖీ పౌర్ణమి రోజు తెలంగాణ ఆర్టీసీ ఆదయం ఎంతంటే?

రాఖీ పౌర్ణమి నాడు రికార్డు స్థాయిలో తెలంగాణ ఆర్టీసీకి రాబడి వచ్చింది

Update: 2024-08-20 07:03 GMT

రాఖీ పౌర్ణమి నాడు రికార్డు స్థాయిలో తెలంగాణ ఆర్టీసీకి రాబడి వచ్చింది. టిక్కెట్లు చెల్లించిన ప్రయాణికులు 21.12 లక్షల మంది కాగా వారి వల్ల టీజీఆర్టీసీకి వచ్చిన ఆదాయం 32కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ప్రయాణికులు తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఆర్టీసీ బ‌స్సుల్లో ఒక్కరోజే 63.86 ల‌క్షల మంది రాక‌పోక‌లు సాగించారు. ఇందులో మ‌హాల‌క్ష్మి ప‌థ‌కాన్ని వినియోగించుకున్న 41.74 ల‌క్షల మ‌హిళలు వినియోగించుకున్నారు. తమ సోదరుల వద్దకు వెళ్లేందుకు ఎక్కువ మంది మహిళలు ఆర్టీసీ బస్సులనుఉపయోగించుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. దీనివల్ల మహిళలకు ఒక్కరోజులోనే ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కారణంగా పదిహేడు కోట్లు రూపాయలు మిగిలాయని అధికారులు లెక్కలు వేసి మరీ చెప్పారు.

రికార్డు స్థాయిలో...
ఆర్టీసీకి రాఖీ పౌర్ణమి రోజు వచ్చిన 32 కోట్ల రూపాయల్లో 21.12 లక్షల మంది న‌గ‌దు చెల్లించి బ‌స్సుల్లో ప్రయాణం చేశార‌ని పేర్కొన్నారు. రాఖీ పండగ రోజు మ‌హాల‌క్ష్మి ప‌థకం ద్వారా రూ.17 కోట్లు, న‌గ‌దు చెల్లింపు టికెట్ల ద్వారా 15 కోట్ల వ‌ర‌కు వ‌చ్చింది. ఆర్టీసీ చ‌రిత్రలో ఒక్కరోజులో ఇంత మొత్తంలో ఆదాయం ఎప్పుడు రాలేదు. భారీ వ‌ర్షంలోనూ ప్రయాణికుల‌ను సుర‌క్షితంగా గ‌మ్యస్థానాల‌కు చేర‌వేసిన ఆర్టీసీ సిబ్బందిని ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్రభాక‌ర్ అభినందించారు. ఆర్టీసి తన మొత్తం సామర్థ్యాన్ని ఉపయోగించుకుంద‌ని, ఉద్యోగులు రాత్రి ,పగలు నిరంతరం శ్రమించారని వారి సేవ‌ల‌ను కొనియాడారు.


Tags:    

Similar News