Vasantha Panchami : నేడు వసంత పంచమి

నేడు వసంత పంచమి కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి

Update: 2024-02-14 01:49 GMT

Vasantha Panchami :నేడు వసంత పంచమి కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వసంత పంచమి రోజు సరస్వతీ దేవీ మాతను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని బాసర దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వసంతి పంచమి రోజున అక్షరాభాస్యాలు చేయిస్తే చదువు బాగా అబ్బుతుందని విశ్వసిస్తారు. అందుకే అక్షరాభ్యాసాల కోసం బాసర ఆలయంలో భక్తులు బారులు తీరారు.

విజయవాడ దుర్గమ్మ చెంత...
విజయవాడ కనకదుర్గ ఆలయంలో కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి వచ్చారు. విజయవాడ కనకదుర్గమ్మ చెంత కూడా భక్తులు అక్షరాభ్యాసం చేయించడం సంప్రదాయంగా వస్తుంది. తెలంగాణలోని బాసర మాత్రమే కాకుండా వర్గల్ లోనూ సరస్వతీ దేవీ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. చదువులతల్లి సరస్వతీ దేవి జన్మదినోత్సవంగా వసంత పంచమిని భక్తులు జరుపుకుంటారు. అందుకే అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో ఉదయం నుంచే కిటకిటలాడుతున్నాయి.


Tags:    

Similar News