Weather Report : అలెర్ట్.. మరో రెండు రోజులు చలి తీవ్రత పెరుగుతుందట.. ఎల్లో అలెర్ట్
తెలంగాణలో గత కొంతకాలంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి;

తెలంగాణలో గత కొంతకాలంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనవరి నెల చివరి రోజులు కావస్తున్నా ఇంకా చలి తీవ్రత తగ్గలేదు. దీనికి తీడు వాతావరణ శాఖ అలెర్ట్ ప్రకటించింది. తెలంగాణలో మరో రెండు రోజుల్లో చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధ, గురు వారాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశముందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతల కంటే మరింత తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారుల తెలిపారు.
కనిష్ట ఉష్ణోగ్రతలు...
ఇప్పటికే ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పది డిగ్రీల ఉష్ణోగ్రతల కంటే తక్కువ నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారుల తెలిపారు. రానున్న రెండు రోజుల్లో మరింత కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశముందని తెలిపింది. దీనికి తోడు చలిగాలుల తీవ్రత కూడా పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే పగటి ఉష్ణోగ్రతలు కొంత పెరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ సాయంత్రం అయ్యే సరికి చలి తీవ్రతతో జనం ఇబ్బందులు పడుతున్నారు.
పొగమంచు కారణంగా...
అయితే ఉదయం వేళల్లో పొగమంచు కూడా ఎక్కువగా ఉంది. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రమాదాలు జరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. పది గంటల తర్వాత మధ్యాహ్నానికి ముప్ఫయి డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా రాత్రి నుంచి ఉదయం వరకూ చలి, పొగమంచు తగ్గడం లేదు. గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కి అంతరాయం కలిగింది. గన్నవరం రావాల్సిన హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, విశాఖపట్నం, ఢిల్లీ విమానాలు ఆలస్యం అయ్యాయి. విమానాల ఆలస్యంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.