నేడు తెలంగాణ ఎంపీలతో మోదీ సమావేశం

తెలంగాణ బీజేపీకి చెందిన పార్లమెంటు సభ్యులతో నేడు ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు;

Update: 2024-11-27 02:21 GMT
narendra modi, prime minister, members of parliament,  telangana bjp

PM Modi

  • whatsapp icon

తెలంగాణ పార్లమెంటు సభ్యులతో నేడు ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. బీజేపీకి చెందిన సభ్యులతో ఆయన సమావేశమై తెలంగాణలో సమస్యలపై చర్చించనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలపైన కూడా మోదీ పార్లమెంటు సభ్యులతో చర్చించనున్నారని తెలిసింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా హాజరు కానున్నారు.

తెలంగాణపై ఫోకస్...
మహారాష్ట్రలో భారీ విజయం తర్వాత ప్రధాని మోదీ తెలంగాణపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు.


Tags:    

Similar News