Telangana : తెలంగాణాలో పంట నష్టంపై మంత్రి తుమ్మల ఆదేశాలు
తెలంగాణాలో నిన్న కురిసిన అకాల వర్షానికి భారీగా పంట నష్టం జరిగింది;

Tummala nageswara rao
తెలంగాణాలో నిన్న కురిసిన అకాల వర్షానికి భారీగా పంట నష్టం జరిగింది. ప్రధానంగా మామిడి తోటలు దారుణంగా దెబ్బతిన్నాయి. పూత దశలో ఉన్న మామిడి పిందెలు రాలిపోయాయి. అయితే అకాల వర్షానికి పంట నష్టం అంచనా వేయాలంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశాలు జారీ చేశారు.
పంటనష్టంపై...
పంట నష్టంపై ప్రాధమిక అంచనాలను రూపొందించి వీలయినంత త్వరగా నివేదిక అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వర్షం కారణంగా పంట ఉత్పత్తులు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించాలన్నారు. మార్కెటింగ్ శాఖ పంట ఉత్పత్తులను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.