అమీర్ పేట్ ఆ ఇల్లంటే రోశయ్యకు అమిత ప్రేమ
కొణిజేట ిరోశయ్య ఆంధ్రప్రదేశ్ లో జన్మించినా ఆయన దాదాపు ఐదు దశాబ్దాల క్రితమే హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డారు.
కొణిజేట ిరోశయ్య ఆంధ్రప్రదేశ్ లో జన్మించినా ఆయన దాదాపు ఐదు దశాబ్దాల క్రితమే హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డారు. రాజకీయంగా ఎదుగుతున్న సమయంలోనే ఆయన కుటుంబంతో సహా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయనకు అమీర్ పేట్ కు ివిడదీయరాని సంబంధం ఉందంటారు. హైదరాబాద్ లో స్థిరపడిన తర్వాత రోశయ్య అమీర్ పేట్ లో సొంత ఇంటిని నిర్మించుకున్నారు.
మంత్రిగా.. ముఖ్యమంత్రిగా....
మంత్రిగా ఉన్నా ఆయన ఏనాడూ మంత్రులకు కేటాయించే క్వార్టర్స్ కు వెళ్లలేదు. తన సొంత ఇంట్లోనే ఉండేవారు. మంత్రుల క్వార్టర్స్ వైపు చూసే వారు కాదు. ఇక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయన అమీర్ పేట్ ను వదల లేదు. పథ్నాలుగు నెలలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ రోజూ అమీర్ పేట్ నుంచి సచివాలయానికి వచ్చే వారు. అమీర్ పేట్ ఇల్లు అంటే రోశయ్యకు అంత ఇష్టం.
తుది శ్వాస వరకూ...
తాను ఇష్టపడి పెంచుకున్న మొక్కలను ఆవరణలో చూసేందుకే ఆయన ముఖ్యమంత్రి అయినా అక్కడ ఉండేందుకే ఇష్టపడ్డారు. ఇక తమిళనాడు గవర్నర్ గా వెళ్లినప్పడు కనీసం నెలలో ఒకసారి అయినా వచ్చి అమీర్ పేట్ నివాసంలో సేద తీరేవారు. ఆయనకు ఆ ఇల్లంటే అంత ఇష్టం. ఇక దాదాపు ఏడేళ్లుగా ఆయన ఆ ఇంట్లోనే ఉంటున్నారు. రోజు ఉదయాన్నే బయట కూర్చుని వాహనాలు శబ్దాలు వినడం, మొక్కలతో మాట్లాడుతుండటం ఆయనకు ఇష్టమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ రోడ్డు మీద నుంచి విన్పించే శబ్దాలే ఆయన ఆయష్షును పెంచాయి. రోజూ రోడ్డు మీద కన్పించే దృశ్యాలే ఆయనకు శక్తి నిచ్చాయి. చివరకు అదే ఇంట్లో ఆయన తుది శ్వాస విడిచారు.