Karnataka results :హైదరాబాద్‌లో క్యాంప్

కర్ణాటక ఫలితాలు వెలువడుతుండటంతో క్యాంప్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి;

Update: 2023-05-13 04:26 GMT
Karnataka results :హైదరాబాద్‌లో క్యాంప్
  • whatsapp icon

కర్ణాటక ఫలితాలు వెలువడుతుండటంతో క్యాంప్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ఎర్లీ ట్రెండ్స్ విడుదలవుతుండటంతో జేడీఎస్ ఎమ్మెల్యేలను క్యాంప్‌నకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు కర్ణాటకకు చెందిన వ్యక్తులు కొందరు తమ ఆధార్ కార్డులను చూపి స్టార్ హోటల్స్‌లో రూమ్‌లు బుక్ చేసుకుంటున్నారు. రెండు రోజులు ముందుగానే కొన్ని రూములు ఇక్కడ బుక్ అయ్యాయి. ఏదైనా హంగ్ అసెంబ్లీ ఏర్పడితే జేడీఎస్‌తో రెండు పార్టీలూ పొత్తుకు ప్రయత్నిస్తారని చెప్పి ఈ క్యాంప్ ను ఏర్పాటు చేశారు.

స్టార్ హోటళ్లలో...
అందిన సమాచారం మేరకు తాజ్ కృష్ణలో పద్దెనిమిది రూములు, పార్క్ హయత్‌లో ఇరవై, నోవాటెల్‌లో ఇరవై రూములు బుక్ చేశారు. ముందుగానే ఆలోచించి క్యాంప్ పెట్టాలని ఆలోచించి జేడీఎస్ నేతలు ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ మద్దతు ఇక్కడ జేడీఎస్‌‌కు ఉండటంతో ఇక్కడే క్యాంప్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భావించి రూములను ముందుగానే బుక్ చేసుకున్నారు.


Tags:    

Similar News