కోనసీమ వచ్చింది... ఆ సెంటిమెంట్ పోయింది

తూర్పు గోదావరి జిల్లా మూడు జిల్లాలుగా మారబోతుంది. ఎక్కువ స్థానాలు సాధిస్తే అధికారం గ్యారంటీ అన్న సెంటిమెంట్ ఉండేది.

Update: 2022-01-26 04:44 GMT

అతి పెద్దదైన తూర్పు గోదావరి జిల్లా ఇక మూడు జిల్లాలుగా మారబోతుంది. 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు పార్లమెంటు నియోజకవర్గాలు తూర్పు గోదావరి జిల్లాలో ఉండేవి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక స్థానాలను సాధించిన పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉండేది. ఇక తూర్పు గోదావరి జిల్లా మూడు జిల్లాలుగా కానుంది. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు కాబోతున్నాయి

మూడు జిల్లాలుగా....
అమలాపురం జిల్లాకు కోనసీమ జిల్లాగా పేరు పెట్టనున్నారు. ఈ జిల్లా పరిధిలో రాజోలు, కొత్తపేట, రామచంద్రాపురం, ముమ్మడివరం, మండపేట, అమలాపురం, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అలాగే కాకినాడ జిల్లా కేంద్రంగా తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాలుంటాయి. రాజమండ్రి జిల్లా కేంద్రంగా రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అనపర్తి, రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలుంటాయి.
పశ్చిమలోనూ....
ఇప్పటి వరకూ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు రాష్ట్ర రాజకీయాలను శాసించేవి. ఇకపై ఆ మాట వినపడే అవకాశం లేదు. ఈరెండు జిల్లాలు మొత్తం ఐదు జిల్లాలుగా మారాయి. ఏలూరు జిల్లా కేంద్రంగా ఏలూరు, దెందులూరు, చింతలపూడి, కైకలూరు, ఉంగుటూరు, పోలవరం, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. భీమవరం జిల్లా కేంద్రంగా పాలకొల్లు, ఉండి, నరసాపురం, ఆచంట, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం నియోజకవర్గాలుంటాయి.


Tags:    

Similar News