గడీల పాలన పులివెందుల్లోనే ఉంది
వైఎస్ షర్మిల పార్టీపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్లో చీలికలు తెచ్చేందుకే కొత్త పార్టీ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కులాలు, మతాలుగా [more]
;
వైఎస్ షర్మిల పార్టీపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్లో చీలికలు తెచ్చేందుకే కొత్త పార్టీ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కులాలు, మతాలుగా [more]

వైఎస్ షర్మిల పార్టీపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్లో చీలికలు తెచ్చేందుకే కొత్త పార్టీ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కులాలు, మతాలుగా విడగొట్టి తిరిగి ఆంధ్ర పెత్తనం చేయాలని చూస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. గడీల పాలన ఎప్పుడో అంతరించిపోయిందని, ఇప్పుడు గడీల పాలన తెలంగాణలో లేదని, పులివెందులలో ఉందని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దుర్బుధ్ధితోనే కొత్త పార్టీలు వస్తున్నాయన్నారు. తెలంగాణలోని సుస్థిర ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకే కొత్త పార్టీలు వస్తున్నాయని ఆయన అన్నారు.