Pawan Kalyan : ఓటమి బాధపెట్టలేదు... అవమానంతో కుంగిపోలేదు
ఓటమితో బాధపడలేదని, అవమానంతో కుంగిపోలేదని జనసేన నేత పవన్ కల్యాణ్ అన్నారు;

ఓటమితో బాధపడలేదని, అవమానంతో కుంగిపోలేదని జనసేన నేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. తమిళ, కన్నడ, మరాఠీ, హిందీలలో ఆయన ప్రసంగించారు. 2019 ఎన్నికలలో ఓటమి పాలయినా తట్టుకుని నిలబడ్డామన్నారు. తన ఓటమిని గేలిచేశారన్నారు. అడిగిన వారిపై కేసులు పెట్టారన్నారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయాల అనుభవం ఉన్న నాయకుడిని జైల్లో పెట్టారన్నారు. తనలాంటివారిని తిట్టిన తిట్టకుండా తిట్టారన్నారు. తనపై నాడు చేయని కుట్ర లేదన్నారు. అసెంబ్లీ గేటును కూడా తాకలేవని ఛాలెంజ్ చేసి చరిసిన తొడలను బద్దలు కొట్టామని పవన్ కల్యాణ్ అన్నారు.
దేశమంతా మనవైపు...
దేశమంతా మన వైపు చూసేలా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేటుతో విజయం సాధించామని తెలిపారు. అన్నీ ఒక్కడినై పోరాటం చేశానని అన్నారు. ఓడినా అడుగు ముందుకే వేశామని పవన్ కల్యాణ్ అన్నారు. నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టామని చెప్పారు. జనసైనికులు, వీరమహిళల పోరాట స్ఫూర్తిని మరిచిపోలేరన్నారు. దాష్టీక ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారన్నారు. తమిళనాడు, మహారాష్ట్రలలో తనను ఆదరించారన్నారు. పదకొండేళ్లు పార్టీని రెక్కల కష్టం మీద నడిపారన్నారు. సినిమాలను దృష్టిలో పెట్టుకుని ఎదగలేదని, సమాజాన్ని చూస్తూ పెరిగానని చెప్పారు. అనేక ఇబ్బందులుపడి పార్టీని పదకొండేళ్లు నడిపామని తెలిపారు.