పులివెందులలో జగన్ బిజీ

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 14 నెలల తర్వాత తన స్వంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. మొన్న తిరుమల, నిన్న కడప పెద్దదర్గాను సందర్శించిన ఆయన [more]

;

Update: 2019-01-12 09:21 GMT
జగన్
  • whatsapp icon

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 14 నెలల తర్వాత తన స్వంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. మొన్న తిరుమల, నిన్న కడప పెద్దదర్గాను సందర్శించిన ఆయన ఇవాళ పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన గండి వీరాంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి పూజలు జరిపారు. తర్వాత ఇడుపులపాయకు చేరుకుని కుటుంబసభ్యులు విజయమ్మ, షర్మిల, భారతితో కలిసి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. జగన్ పులివెందుల పర్యటన సందర్భంగా పెద్దఎత్తున కార్యకర్తలు, ప్రజలు ఆయనను చూడటానికి వచ్చారు.

Tags:    

Similar News