బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో బెయిల్ కోసం..?
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ వాయిదా వేసింది సికింద్రాబాద్ కోర్టు. ముందస్తు బెయిల్ మంజూర్ చేయవద్దని పోలీసలు కౌంటర్ [more]
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ వాయిదా వేసింది సికింద్రాబాద్ కోర్టు. ముందస్తు బెయిల్ మంజూర్ చేయవద్దని పోలీసలు కౌంటర్ [more]
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ వాయిదా వేసింది సికింద్రాబాద్ కోర్టు. ముందస్తు బెయిల్ మంజూర్ చేయవద్దని పోలీసలు కౌంటర్ అఫడవిట్ ని కోర్టుకు సమర్పించారు.ఇక ఇదే కేసులో ఇప్పటికే అరెస్టు అయిన 15 మంది బెయిల్ మంజూరు చేయాల్సిందిగా వేర్వేరు పిటీషన్లను ఫైల్ చేశారు. నిందితులెవరికి బెయిల్ ఇవ్వోందంటూ కౌంటర్ లో పోలీసులు పేర్కొన్నారు. అన్ని పిటీషన్లపై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టు.
బెయిల్ కోసం….
బోయిన్ పల్లి కేసులో ఓ వైపు పోలీసుల విచారణ జరుగుతోంది. మరో వైపు నిందితుల బెయిల్ పిటీషన్లు వరుసగా ఫైల్ అవుతున్నాయి. ఇప్పటికే కేసులో ముందస్తు బెయిల్ కోసం భుమా అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి సికింద్రాబాద్ కోర్టును అశ్రయించాడు. తనకు కేసుతో సంబందం లేదని, కావాలనే పోలీసులు తనను ఈ కేసులో ఇరికించారంటూ ముందస్తు బెయిల్ పిటీషన్ లో పెర్కొన్నాడు జగత్ విఖ్యాత్ రెడ్డి.