పోతున్నది... చెత్తా? బంగారమా?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గతంలో అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆయన ఓ సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 'పక్కింట్లో చెత్త మన ఇంట్లో బంగారం అవుతుందా?' అని ప్రశ్నించారు.

Update: 2024-01-14 05:43 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ గతంలో అన్న మాటలు  ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆయన ఓ సందర్భంలో ఆయన మీడియాతో  మాట్లాడుతూ 'పక్కింట్లో చెత్త మన ఇంట్లో బంగారం అవుతుందా?' అని ప్రశ్నించారు. తెలుగుదేశం నుంచి వైస్సార్సీపీలోకి కొందరు నేతలు జంప్ చేసిన సందర్భంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో ఆయారాం, గయారాంల సంఖ్య పెరుగుతోంది. ఈ నేఫధ్యంలో లోకేష్ మాటలు మరింత  ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రస్తుతం తాము ఇన్నాళ్లు ఉన్న పార్టీలో టిక్కెట్లు రాని అభ్యర్థులంతా పక్క చూపులు చూస్తున్నారు.ఈ పరిస్థితి  వైకాపా, టీడీపీ, జనసేన.. మూడు పార్టీల్లోనూ కనిపిస్తోంది. ఇంతవరకు కీలక నేతలుగా చలామణి అయిన వాళ్లంతా కూడా ఒక్కసారిగా పార్టీ ఫిరాయించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. జగన్.. పెద్ద సంఖ్యలో సిటింగ్ అభ్యర్థులను మారుస్తుండడంతో టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. తెలుగుదేశం నుంచి కూడా కొంతమంది ముఖ్యమైన నాయకులు వైకాపాలో చేరుతున్నారు. నిన్నటి వరకు తమ నాయకుడిని ఆహా ఓహో అని పొగిడిన నేతలు... తమ సీటుకి ఎసరు వచ్చిందని తెలియడంతో వైరిపక్షాన్ని ఆశ్రయిస్తున్నారు. వెనుకాడిన వర్గాల పాలిట దేవుడు అని తమ గత నాయకుడిని ఆకాశానికి ఎత్తిన ప్రతినిధులే..  ఈ రోజు నోటికొచ్చినట్లు తిడుతున్నారు. పార్టీలు మారుతున్న నేతలు తమ నాలికను కూడా వెంటనే మార్చడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. పక్కింట్లోకి వెళ్ళింది చేత్తో, బంగారమో తెలియాలంటే...ఎన్నికలు అయ్యేదాకా వేచి చూడాలి. 

Tags:    

Similar News